ప్రజాశక్తి -గాజువాక : బిహెచ్‌ఇఎల్ విశాఖపట్నం యూనిట్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన కంపెనీ మెయిన్ గేట్ వద్ద మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భెల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జిటిపి ప్రకాష్ మాట్లాడుతూ, 2021-2022 ఆర్థిక సంవత్సరానికి భెల్ లాభాల్లోకి వచ్చిందని, అయినా యాజమాన్యం జూన్, జులై నెలల్లో పిపిపి చెల్లించ లేదని తెలిపారు. పిపిపిని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. జెఎన్‌సి పునర్‌వ్యవస్థీకరించి నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. కార్మిక ఇన్సెంటివ్, రూ.30 వేల ల్యాప్‌టాప్ బిల్లుల చెల్లింపు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారానికి యాజమాన్యం స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో అప్పారావు సనపల, జగన్నాధరావు, విజరు కుమార్, నారపరెడ్డి, సిహెచ్‌ఎస్‌వి నారాయణ, ఎన్‌వి శ్రీనివాసరావు, జనార్ధన్, శివరాం పాల్గొన్నారు.










