ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న ఎంపిటిసి, జడ్‌పిటిసి, సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం ఇక్కడ ఉన్న ఇవిఎంలను పటిష్ట బందోబస్తుతో వివిధ ప్రాంతాలకు తరలించారు. గత ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ సమకూర్చిన అదనపు ఇవిఎంలు కార్పొరేషన్ కార్యాలయంలో భద్రపరిచారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్లా ఆదేశాల మేరకు వీటిని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ను తెరిచి ఆయా ప్రాంతాలకు పంపారు. అదనపు కమి షనర్ సీహెచ్ నాగనరసింహారావు పర్యవేక్షణలో నగరపాలక సంస్థ కార్యదర్శి ఎం.ఏసుబాబు, మేనేజర్ కర్రి సత్యనారాయణ, సూపరిం టెండెంట్లు ఏర్పాట్లు పర్యవేక్షించారు. రాజకీయ పార్టీలకు సంబంధించి వైసిపి రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వర రావు, టిడిపి ప్రతినిధి గదుల సాయిబాబా, బిఎస్‌పి ప్రతినిధి అప్పారావు సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లను తెరిచి బ్యాలెట్ బాక్సులను తరలించిన అనంతరం వీరి సమక్షంలో సీల్ వేశారు.
పోలీసు బందోబస్తు మధ్య ఈవిఎంలు తరలిస్తున్న అధికారులు, వివిధ పార్టీల నాయకులు










