May 24,2023 22:54

అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ కృతికా శుక్లా



ప్రజాశక్తి - కాకినాడ
కాకినాడ జిల్లాలో పరిశ్రమల్లో భద్రతతో పాటు కాలుష్య నియంత్రణ ప్రమాణాలను పూర్తిస్థాయిలో పాటించేలా అధికారులు పటిష్ట పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. బుధ వారం కలెక్టరేట్‌ కోర్టుహాల్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక, ఎగుమ తుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. తొలుత గత సమా వేశంలో తీర్మానించిన అంశాలకు సంబంధించి తీసుకున్న చర్యలపై చర్చిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కృతికా శుక్లా మాట్లాడుతూ పరిశ్ర మల్లో భద్రతతో పాటు పారిశ్రామిక కార్యకలాపాల వల్ల పర్యావరణం కలుషితం కాకుండా ముఖ్యంగా జల వనరులపై ప్రత్యేకంగా దృష్టి సారించా లన్నారు. అవసరమైన చోట సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు (ఎస్‌టిపి) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పారిశ్రామిక యూనిట్లకు సత్వర అనుమతుల జారీకి అమల్లో ఉన్న ఎపి సింగిల్‌ డెస్క్‌ విధానం కింద 2023, ఏప్రిల్‌ 11 నుంచి ఈనెల 22 వరకు 53 దరఖాస్తులకు గాను వివిధ శాఖల పరిధిలో 35 దరఖాస్తులు ఆమోదం పొందినట్లు వివరించారు. మిగిలిన దరఖాస్తులను నిర్దిష్ట ఎస్‌ఎల్‌ఏ గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలకు సంబంధించి పారిశ్రామిక అభివృద్ధి విధానాలు (2015-20, 2020-23), వైఎస్సార్‌ జగనన్న బడుగు వికాసం పథకం పరిధిలో 25 యూనిట్లకు ప్రోత్సాహకాల క్రింద రూ. 2.53 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జిఎం టి.మురళి, ఎడి కె.కృషా ్ణరావు, ఎల్‌డిఎం, సిహెచ్‌ఎస్‌వి ప్రసాద్‌, డిపిఒ ఆర్‌.విక్టర్‌, డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ డి.రాధాకృష్ణ, ట్రాన్స్‌పోర్టు అధికారి పివి. సాయిప్రసాద్‌ తదితరులు హాజరయ్యారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై సమీక్ష
బుధవారం కలెక్టరేట్‌ కోర్టుహాల్‌లో ఐరాస సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో జిల్లాలో పురోగతిపై విద్య, ఆరోగ్యం, ఐసిడిఎస్‌ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. చిన్నారులు, కిశోర బాలికలు, గర్భిణుల ఆరోగ్య పరీక్షలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. పాఠశాలల్లో డ్రాప వుట్‌లను గుర్తించి తిరిగి చేరేలా చూడాలన్నారు. ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి (జిఇఆర్‌), గర్భిణుల ఆరోగ్యం, పాఠశాలల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, రక్త హీనత పరీక్షలు, సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు తదిత రాలపై కలెక్టర్‌ కృతికా శుక్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ ఆర్‌.రమేష్‌, ఐసిడిఎస్‌ పీడీ కె.ప్రవీణ, మెప్మా పీడీ బి.ప్రియంవద తదితరులు పాల్గొన్నారు.