Sep 21,2023 19:42

నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

భద్రత ఇవ్వలేని జిపిఎస్‌ వద్దు : యుటిఎఫ్‌
ప్రజాశక్తి -ప్యాపిలి

భద్రత కల్పించలేని గ్యారంటీ పెన్షన్‌ స్కీమ్‌ (జిపియస్‌) మాకు వద్దు అని యుటిఎఫ్‌ ప్యాపిలి మండల శాఖ అధ్యక్షులు కృష్ణ నాయక్‌, ప్రధాన కార్యదర్శి నరసింహరెడ్డి అన్నారు. గురువారం వారు మాట్లాడుతూ కేబినెట్‌ సమావేశంలో జిపిఎస్‌ను ఆమోదించడం దుర్మార్గం అన్నారు. గ్యారంటీ అనేది పేరు లోనే ఉంది తప్ప.. వాస్తవానికి ఫించను ఇవ్వడంలో లేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా సిపియస్‌ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత జిపిఎస్‌తో మరో కొత్త నాటకానికి ప్రభుత్వం తెర లేపిందని దుయ్యబట్టారు. పాత పెన్షన్‌ విధానం మాత్రమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మండలంలోని యుటిఎఫ్‌ నాయకులు నల్ల రిబ్బన్‌ ధరించి విధులకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యూటిఎఫ్‌ ఆర్థిక కార్యదర్శి మధు, మండల కార్యదర్శి రాజన్న, జిల్లా కౌన్సిలర్లు బొజ్జన్న,హరి నారాయణ, లోకేశ్వరి, పాల్‌, మాబాషా, సాలయ్య, షరీఫ్‌,నాగ మద్దయ్య,నాగాంజనేయులు,శంకర్‌ తదితరులు పాల్గొన్నారు
పాత పెన్షన్‌ విధానమే కావాలి
- జిపిఎస్‌ వద్దు - సిపిఎస్‌ వద్దు
-ఎస్‌టియు ఉపాధ్యాయ సంఘం
చాగలమర్రి పోటో 2.మాట్లాడుతున్న ఎస్‌టియు రాష్ట్ర మీడియా కన్వీనర్‌
ప్రజాశక్తి - చాగలమర్రి

జిపిస్‌ వద్దు,సిపిఎస్‌ వద్దు పాత పెన్షన్‌ విధానమే కావాలని ఎస్‌టియు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మీడియా కన్వీనర్‌ నాగేంద్ర కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసారు. గురువారం స్థానిక ఎస్‌టియు కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ భద్రతలేని గ్యారెంటీ పెన్షన్స్‌ స్కీంను రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్‌టి యు మండల శాఖ అధ్యక్షుడు జి మస్తాన్‌ బాష, ప్రధాన కార్యదర్శి మేకల సుబ్బారావు ,ఆర్థిక కార్యదర్శి టి మాబుహుస్సేన్‌, స్టేట్‌ కౌన్సిలర్లు శివశంకర్‌ ,ప్రసాద్‌, జయరాజ్‌, జిల్లా కౌన్సిలర్లు నారాయణరెడ్డి ,రాజశేఖరరెడ్డి, శేషాద్రి ,నరసింహులు, సురేశప్ప ,మహబూబ్‌ బాషా ,ఐడికే శాస్త్రి ,వై శ్రీనివాసులు,తదితరులు పాల్గొన్నారు.