Feb 25,2023 01:34
దేవులపల్లి కృష్ణశాస్త్రి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-బాపట్ల: భావ కవిత్వ ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసిన దేవులపల్లి కృష్ణశాస్త్రి రచనలు సాహిత్య లోకంలో సజీవంగానే ఉంటాయని సప్తస్వర సంగీత కళాశాల ప్రిన్సిపల్‌ కోటిరాజ్‌ అన్నారు. శుక్రవారం దేవులపల్లి కృష్ణశాస్త్రి 43వ వర్థంతిని కళాశాల ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా కోటిరాజ్‌ మాట్లాడుతూ నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు.. నా ఇఛ్ఛయే గాక నాకేటి వెరపు అంటూ భావ కవిత్వ ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసిన భావ కవితోద్యమకారుడు దేవులపల్లి అని కొనియాడారు. దేవులపల్లి వారి రచనలు వెలుగుందుతూనే ఉంటాయన్నారు. కార్యక్రమంలో సాహితీ భారతీయ అధ్యక్షులు రావూరి నరసింహవర్మ, మర్రి మాల్యాద్రిరావు, దివి శ్రీనివాస మూర్తి, కస్తూరి శ్రీనివాసరావు, అల్లురమ్మ, ఆదం షఫీ, ఎన్‌ కృష్ణ, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు, రెంటాల మురళీ రాధాకృష్ణమూర్తి, పువ్వాడ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.