
ప్రజాశక్తి - కడియం విద్యార్థుల్లో ఉన్న భాషా నైపుణ్యాలను తెలుసు కునేందుకు స్టేట్ ఎడ్యు కషనల్ ఎచీవ్‌మెంట్ సర్వేను నిర్వహిస్తున్నట్లు ఎంఇఒ వి.లజపతి రారు అన్నారు. మండలంలోని 30 ప్రభుత్వ మరియు ప్రయివేటు పాఠశా లల్లో ఈ సర్వే నిర్వహి స్తున్నట్లు తెలిపారు. ప్రతి పాఠశాలలోనూ 3, 6, 9 తరగతి విద్యార్థులకు ఈ సర్వే నిర్వహించాలని, ఈ సర్వే ద్వారా విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు ఏ విధంగా ఉన్నాయో అంచనా వేసి, తద్వారా విద్యార్థులకు ఏఏ అంశాలలో శిక్షణ ఇవ్వాలో ప్రభుత్వం అంచనా వేస్తుందన్నారు. ఈ పరీక్షా విధానం నవంబర్ మూడో తేదీన రాష్ట్రంలోని ఎన్నిక కాబడిన పాఠశాలల్లో నిర్వహిస్తారని తెలిపారు.అందుకు అవసరమైన రీతిలో విద్యార్థులను సన్నద్ధం చేయాలని హెచ్‌ఎంలకు ఆయన సూచించారు. మండల విద్యాశాఖ అధికారి-2 వై.నాగేశ్వ రరావు మాట్లాడుతూ ఈ పరీక్షా విధానం గురించి కూలంకషంగా వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా ఎంఐఎస్ ప్లానింగ్ కోఆర్డినేటర్ నరసింహారెడ్డి శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించి ఉపాధ్యాయులకు వచ్చిన సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ , ప్రయివేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సిఆర్‌పిలు, ఎంఆర్‌సి సిబ్బంది పాల్గొన్నారు.