ప్రజాశక్తి ధర్మవరం టౌన్ : ప్రపంచ దేశాలలో భారతదేశం విశిష్టఖ్యాతిని సంపాదించిందని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు వైకుంఠం మల్లికార్జున చౌదరి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరాం అన్నారు. చంద్రయాన్- 3 విజయవంతంపై గురువారం టీడీపీ స్థానిక కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతం కావడం దేశానికి గర్వకారణమన్నారు. అపజయాలకు కుంగిపోకుండా మరోమారు చంద్రయాన్ ప్రయోగం చేసి విజయం సాధించడంతో దేశపౌరులుగా గర్వపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు గోనుగుంట్ల విజయకుమార్, కమతం కాటమయ్య, నాయకులు నాగూర్ హుస్సేన్, రాళ్లపల్లి షరీప్, చింతలపల్లి మహేశ్ చౌదరి, పురుషోత్తంగౌడ్, అంబటిసనత్, రమణ, లక్ష్మీనారాయణ, కరెంటు ఆది, కేశగాళ్లశీన, కేతినేని రాజ, చెలిమిశివరాం తదితరులు పాల్గొన్నారు.
కాకతీయ విద్యానికేతన్‌లో... చంద్రయాన్-3 విజయవంతం కావడంతో పట్టణంలో పలువురు సంబరాలు జరుపుకున్నారు. కాకతీయ విద్యానికేతన్లో విద్యార్థులు ఇస్రో కంగ్రాట్స్ ఆకారంలో వినూత్నంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పౌండర్ మేడాపురం రామిరెడ్డి, కరస్పాండెంట్ శెట్టిపి నిర్మల జయచంద్రారెడ్డి. డైరెక్టర్లు శెట్టిపి సూర్యప్రకాశ్ రెడ్డి, పద్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అదే విధంగా చంద్రయాన్-3 విజయవంతంపై ప్రభుత్వ బాలికలజూనియర్ కళాశాల విద్యార్థినిలు ప్రధాన వీధులగుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ బండివేణుగోపాల్, ప్రిన్సిపల్ లక్ష్మీకాంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొత్తచెరువు : చంద్రయాన్ - 3 విజయవంతం కావటంతో స్థానికశ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈసందర్బంగా 170 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ రాధాకృష్ణ, ప్రిన్సిపల్ నవీన్ కుమార్ రెడ్డి, ఏవో కేశవరెడ్డి, డీన్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతం ప్రతి భారతీయుడికి గర్వకారణమని మున్సిపల్ వైస్ చైర్మన్ బలరామిరెడ్డి అన్నారు. చంద్రయాన్-3 విజయవంతంపై గురువారం శ్రీచైతన్య పాఠశాల ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ఇస్రో శాస్త్రవేత్తల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ ఈరన్న, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి, ఎఒ ప్రభాకర్‌రెడ్డి, డీన్ నాగరాజు, పిఇటి మూర్తి,ఉపాధ్యాయులు అంజినేయులు, ప్రేమ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా నారాయణ పాఠశాల విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎజిఎం రమేష్ బాబు, ప్రిన్సిపల్ శివ కుమార్ రాజు, ఎఒ మత్యాలన్న, అకాడమిక్ డీన్ అశోక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










