ప్రజాశక్తి - వేటపాలెం
సెయింట్ ఆన్స్ ఫార్మసి కళాశాల అధ్యాపకుడు డి సాంసన్ ఇజ్రయేల్ జాతీయ స్ధాయి ఆవార్డు సాధించినట్లు కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. న్యూఢిల్లీ కెటికె అవుట్ స్టాండింగ్ అచీవర్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సంస్థ ఇటీవల ప్రకటించిన జాతీయ స్థాయి అవుటాండింగ్ ఎచీవ్ మెంట్స్ అండ్ రిమార్బుల్ కంట్రిబ్యూషన్ ఇన్ ది ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అనే అంశంపై కళాశాలకు చెందిన అధ్యాపకుడు డి సాంసన్ ఇజ్రయేల్ భారత్ శిక్షా గౌరవ్ పురస్కార్ అవార్డును సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ వివి నాగేశ్వరరావు తెలిపారు. అవార్డు పొందిన సందర్భంగా వివిధ అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు అభినందనలు తెలిపారు.










