Aug 06,2023 21:23

పుస్తకాన్ని విష్కరిస్తున్న జెవివి నాయకులు, రచయితలు , ఉపాధ్యాయులు

ప్రజాశక్తి పార్వతీపురం రూరల్‌ : జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక సభ్యులు డాక్టర్‌ వి.బ్రహ్మారెడ్డి రచించిన భారత ప్రజలమైన మేము''అనే పుస్తకాన్ని ఆదివారం స్థానిక గిరిజన కళాభవన్‌ లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రముఖ కవి, రచయిత గంటేడ గౌరునాయుడు ఆవిష్కరించారు. స్నేహితుల సాహితీ, జన విజ్ఞాన వేదిక సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేదిక నాయకులు డాక్టర్‌ ఎంవీఆర్‌ కృష్ణాజీ, రత్న కుమార్‌, యుటిఎఫ్‌ నాయకులు ఎస్‌.మురళీమోహన్‌, గిరిజన సంక్షేమ సంఘం నాయకులు పాలక రంజిత్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు భారత రాజ్యాంగం అమలు, ఉల్లంఘన అనే అంశంపై జరిగిన సదస్సులో జన విజ్ఞాన వేదిక నాయకులు ఎంవిఎన్‌ వెంకటరావు మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగం అమలు కావడం లేదని, ప్రాధమిక హక్కులు లేకుండా పాలకులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మణిపూర్‌ మారణహౌమం లాంటి సంఘటనలు అసలు నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రిజర్వేషన్లు కూడా ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యాంగ రక్షణ కోసం కషి, పోరాటం జరగాలని అన్నారు.ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కు పోరాటం అవసరమని అన్నారు.