Mar 11,2023 01:34
విద్యార్థి శివనాగిరెడ్డి

ప్రజాశక్తి-చీరాల: భారత కోకో జట్టుకు చీరాల ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థి ఎంపిక కావటం తమ కళాశాల కు గర్వకారణమని సిఇసి కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి రవికుమార్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ అస్సాంలో జరగనున్న ఆసియా కోకో పార్లమెంటులో భారత జట్టుకు పాల్గొనే తమ కళాశాల విద్యార్థి ఆట్ల శివనాగి రెడ్డి ఎంపిక కావడం హర్షనీయమన్నారు. శివనాగిరెడ్డి తమ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నారని ఈ నెల 14 నుంచి 18 వరకు జరిగే శిక్షణ శిబిరంలో విద్యార్థి పాల్గొంటా రని అన్నారు. కోకో టోర్నమెంట్‌ ఈ నెల 20 నుంచి 23 వరకు జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఇండియా జట్టుకు ఎంపికైన శివనాగిరెడ్డికి కళాశాల పీడీ శ్రీనివాసరావు, యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు అభినందనలు తెలియజేశారు.