Mar 04,2023 00:11
కరపత్రాలు ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-రేపల్లె: ఈ నెల 5వ తేదీన జరగనున్న భారత్‌ బచావో ఉమ్మడి గుంటూరు జిల్లా సదస్సును జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ప్రత్యూష సుబ్బారావు కోరారు. భారత రాజ్యాంగ పీఠికలోని మౌలిక అంశాలైన సర్వసత్తాక ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద గణతంత్ర భావాలకు భిన్నంగా మనువాద కార్పొరేట్‌ కాషాయ మతోన్మాద సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ ఆదేశాల మేరకు రాజ్యాంగాన్ని మార్చి దాని స్థానంలో మనువాదాన్ని ప్రవేశ పెట్టాలని ప్రయత్నించటం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. ఫాసిజాన్ని ఓడిద్దాం, లౌకిక వాదాన్ని సాధిద్దాం అనే లక్ష్యంతో మతసామ రస్యం, రాజ్యాంగ పరిరక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా కార్పొరేటీకరణకు వ్యతిరే కంగా అన్ని జిల్లాలలోనూ సదస్సులు నిర్వహిస్తు న్నట్లు తెలిపారు. అందులో భాగంగా భారత్‌ బచావో ఉమ్మడి గుంటూరు జిల్లా సదస్సును మార్చి 5వ తేదీన గుంటూరు నగరంలోని మలయలంక భవనంలో పెద్దఎత్తున నిర్వహిస్తు న్నామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యవాదులు, ఉద్యమ కారులు, సామాజిక న్యాయం కోరే ప్రతి ఒక్కరూ కూడా సదస్సును జయప్రదం చేయాలని జిల్లా సెక్రెటరీ పాశం రామారావు పిలుపునిచ్చారు. భారత్‌ బచావో ఉమ్మడి గుంటూరు జిల్లా సదస్సు కన్వీనర్‌ కోలా నవజ్యోతి, తాటికొండ నరసింహారావు, జన విజ్ఞాన వేదిక నాయకులు లక్ష్మణరెడ్డి, బత్తుల కోటేశ్వరరావు డి సుధాకర్‌, ఏఐటీయూసీ నాయకులు ఎం హనుమంతరావు, ఈమని అప్పారావు, చిష్టి, బీసీ మహాజన సభ ఉగ్గం సాంబశివరావు, పికేఎస్‌ నాయకులు పోతురాజు, నూర్‌బాషా సంఘం జిల్లా కార్యదర్శి ఎస్‌కె ఖాజావలి, పలువురు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.