ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి గస్తీ నిర్వహించగా లారీలో అక్రమంగా తరలిస్తున్న గుట్కాను గుర్తించి స్వాధీన పరుచుకున్నట్లు ఎస్‌ఐ శిరీష తెలిపారు.అర్థరాత్రి సమయంలో జాతీయ రహదారిపై గస్తీలో ఉండగా, తుని నుంచి విశాఖ వైపు లారీలో గుట్కా తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు.. కాగిత టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీ (కర్ణాటక రిజిస్టర్)ని సిబ్బందితో కలిసి తనిఖీ చేయగా 80 బస్తాల్లో ఉన్న గుట్కా ప్యాకెట్లు ను గుర్తించి, గుట్కాతో సహా లారీని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. సుమారుగా దీని విలువ రూ.25 లక్షల 66 వేలు ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ లోకేష్, క్లీనర్ గంగాధర్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గుట్కా ప్యాకెట్లను లారీలో బరంపురం తీసుకు వెళ్తున్నారని ఎస్‌ఐ శిరీష తెలిపారు.










