Mar 26,2023 00:32

నేల కూలిన చెట్టు

ప్రజాశక్తి.మాడుగుల.భారీ వర్షాలు, ఈదురు గాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ద్రోణి కారణంగా మండలంలో కొద్ది రోజుల నుండి ఈదురు గాలులు వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత సోమవారం ఈదురు గాలులు కారణంగా అనేక గ్రామాలలో చెట్లు నేల కూలాయి. శనివారం సాయంత్రం రెండు గంటల పాటు భారీ వర్షం పడింది. మండలంలోని అనేక గ్రామాల్లో మామిడి పంట పూర్తిగా ధ్వంసం అయ్యింది. వర్షాల కారణంగా అనేక వ్యాపారాలకు నష్టం వాటిల్లింది.