ప్రజాశక్తి-కొయ్యూరు
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొయ్యూరు మండలం, మూలపేట పంచాయితీ పరిధి కొండసంత గ్రామంలో పెంకిటిల్లు ఆదివారం సాయంత్రం కూలిపోయింది. గ్రామానికి చెందిన గుర్రం సింహాచలం కుటుంబం ఇంట్లో ఉండగానే ఇంటికి ఒక వైపు వున్న గోడ కూలిపోవడంతో వారంతా భయబ్రాంతులకు గురయ్యారు. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇల్లు కూలిపోవడంతో ఆ కుటుంబం ప్రస్తుతం తలదాచుకోవడానికి నీడలేక నిరాశ్రయమైంది. తమకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది.
నేలకొరిగిన భారీ వక్షం
అడ్డతీగల : భారీ వర్షాలకు మండల కేంద్రం శివారులోని ఏలేశ్వరం -అడ్డతీగల రహదారిలో భారీ వృక్షం కూలిపోయి రోడ్డుపై పడింది. దీంతో ఏలేశ్వరం నుండి వచ్చే ఆర్టీసీ బస్సులు స్కూల్ బస్సులు, వాహనాల నిలిచిపోయాయి. ఆర్ అండ్ బి అధికారులకు సమాచారం అందించిన ఎవరు స్పందించలేదు. దీంతో అడ్డతీగల వైస్ సర్పంచ్ ముప్పశెట్టి శ్రీను చొర చూపించి జెసిపి సాయంతో చెట్టును తొలగించి రోడ్డు క్లియర్ చేశారు. వాహనదారులు వైస్ సర్పంచి కృతజ్ఞతలు తెలిపారు.










