Jun 26,2023 00:57

సత్తెనపల్లి సమావేశంలో మాట్లాడుతున్న ధరణికోట విమల

మాచర్ల: రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్ను, విద్యుత్‌ ఛార్జీలు రూపంలో ఇబ్బడిముబ్బడిగా ప్రజలపై భారాలను మోపు తోందని, అవి ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌ అన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆదివారం జరిగిన మాచర్ల డివిజన్‌ కమిటీ సాధారణ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజ రయ్యారు. ఈ సందర్భంగా విజయకుమార్‌ మాట్లాడుతూ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు తెలియకుండా భారాలు వేయడంలో నేర్పరితనం చూపిస్తోందని విద్యుత్‌ చార్జీల అడ్డగోలు పెంపు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో పురపాలక శాఖ పరిధిలో ఆస్తి పన్ను అద్దె ఆధారంగా ఉండేదని, ఇప్పుడు విలువ ఆధారంగా పెంచడం వలన ప్రజలపై భారం పడు తోందన్నారు. ప్రజలపై అడ్డగోలుగా భారాలు వేసిన ఏ ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేదన్నారు. ఈ పన్నుల భారాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమం జరగనున్నట్లు చెప్పారు. కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని , ఆ హామీ ప్రకారం వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తానని హామీ ఇచ్చారని అది అమలు చేయా లన్నారు. వరిక పూడి సెల ఎత్తిపోతల పథకం కరువు ప్రాంతాలైన మాచర్ల వినుకొండ పుల్లలచెరువు ప్రాంతాల్లోని అనేక గ్రామాలకు వరమని దానిని చిత్తశుద్ధితో పూర్తి చేయా లన్నారు. గత ప్రభుత్వాలు మాదిరిగా శంకుస్థాపన కాకుండా వెంటనే కాంట్రాక్టరుని పిలిచి పనులు ప్రారం భించాలన్నారు. పోలవరం నిర్వాసితుల కోసం జరుగు తున్న పోరుబాటకు మద్దతు తెలిపాలని ఆర్థిక సహకారం అందించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు లక్ష్మీశ్వర్‌ రెడ్డి, స్థానిక నాయకులు బండ్ల మహేష్‌,ఎన్‌ లక్ష్మయ్య,వెంకటరత్నం, సురేష్‌, శోభన్‌ కుమార,్‌ జె.శ్రీను, వి.వెంకట్రావు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రాజు,ఆదిత్య, చైతన్య పాల్గొన్నారు.
28న ధర్నాను జయప్రదం చేయండి
సత్తెనపల్లి:రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ ఛార్జీలను వెంటనే తగ్గించాలని సిపిఎం సత్తెనపల్లి పట్టణ కార్యదర్శి ధరణికోట విమల ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ నెల 28న తహశీల్దార్‌ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక కొత్తపేట మహాలక్ష్మి చెట్టు వద్ద జరిగిన వీధి సమా వేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. విమల మాటా ్లడుతూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే విద్యుత్‌ శాఖను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తన పరిధిలోనికి లాగేసుకొని తన ఇష్టం వచ్చినట్లు విద్యుత్‌ ఛార్జీలను పెంచు తున్నారని విమర్శించారు. కేంద్రం పెంచమన్నప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలను పెంచి అమలు చేస్తోందని, ఇప్పటికి ఏడుసార్లు పెంచి ప్రజలపై భారాలు మోపారని విమర్శించారు. పీక్‌ అవర్‌ పేరుతో కొన్ని ప్రత్యేక వేళల్లో ప్రత్యేక విద్యుత్‌ ఛార్జీలను పెంచడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని అన్నారు. ఈ నేపథ్యంలో పెంచిన విద్యుత్‌ చార్జీలను వెంటనే తగ్గించాలని అన్ని రాజకీయ పార్టీలు,ప్రజాసంఘాల ఆధ్వర్యంలో 28న తహశీల్దార్‌ కార్యా లయం వద్ద ఉదయం 10 గంటలకు జరిగే ధర్నాలో ప్రజలు పాల్గొనాలని కోరారు. సమావేశంలో సిపిఎం నాయకులు డి.వెంకటేశ్వర్లు, స్థానిక మహిళలు కామేశ్వరి, అంజని,సునీత తదితరులు పాల్గొన్నారు.