కడప అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ భారాలను తక్షణమే ఆపకపోతే రానున్న కాలంలో పోరాటాలను మరింత ఉదతం చేస్తామని సిపిఎం నగర కార్యదర్శి రామమోహన్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మనోహర్ హెచ్చరించారు. బుధవారం పాత బస్టాండ్‌లోని పూలే సర్కిల్ వద్ద సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ భారాలను తక్షణమే ఆపాలని రాస్తారోకో నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ వినియో గదారులపై 14 నెలలుగా విద్యుత్ వినియో గఛార్జీలకు అదనంగా 25 నుంచి 80శాతం అద నపు భారం మోపుతున్నారని విమర్శించారు. వినియోగదారుడు ప్రతినెలా సక్రమంగా బిల్లు చెల్లిస్తున్నప్పటికీ పాత బకాయిల పేరుతో మళ్లీ అదనపు ఛార్జీలు విధించడం ఎంతవరకు సమంజ సమని ప్రశ్నించారు. విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలకు వినియోగదారుడు ఏమాత్రం బాధ్యుడు కాదన్న విషయాన్ని ప్రభుత్వం గమనంలో ఉంచుకో వాలన్నారు. విద్యుత్ వినియోగఛార్జీలు మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా అదనంగా రకరకాల పేర్లతో భారం మోపడం తగదు అన్నారు. ఒకవైపు సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను భరించలేక ఇబ్బం దులు పడుతుంటే ప్రభుత్వం మరోవైపు విద్యుత్ అదనపు ఛార్జీల పేరుతో ప్రజానీకం మీద భారం మోపుతుందన్నారు. ఈ భారాలు ఇంతటితో ఆగదని, 2025 వరకు ఈ కొనసాగే ప్రమాదం ఉందని అన్నారు. సామాన్య ప్రజల ఆర్థిక స్థితిగ తులు రోజురోజుకు దిగజారుతున్న ప్రస్తుత పరిస్థితిలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని విద్యుత్ చార్జీల భారాన్ని ఉపసంహారించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న భారాలను భరించే ందుకు ప్రజానీకం సిద్ధంగా లేరని అన్నారు. రాస్తారోకో సందర్భంగా వాహనాలు పెద్ద ఎత్తున నిలిచాయి. అనంతరం 1టౌన్ సిఐ నాగరాజు ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత వ్యక్తిగత పూచిపై విడుదల చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దస్తగిరి రెడ్డి, పాపిరెడ్డి, నగర కమిటీ సభ్యులు చంద్ర రెడ్డి, ఓబులేసు, పారుక్ హుస్సేన్, మహబూబ్ తార, జమీల, రమాదేవి, కామేశ్వరమ్మ, గోపాల కష్ణయ్య, ఒబులయ్య, అన్వర్, నారాయణ రెడ్డి, షాకీర్, విజరు, బలపనూరు శ్రీను, నాయుడు, శ్రీను, నాగరాజు, చాంద్ బాషా, ఉదరు పాల్గొన్నారు.










