భారాలకు వ్యతిరేకంగా పోరాటం : సిపిఎం
ప్రజాశక్తి - ఆత్మకూరు
ఇంటి పన్ను, చెత్త పన్ను భారాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం పట్టణ కార్యదర్శి ఏ. రణధీర్, పట్టణ నాయకులు ఎన్. స్వాములు, డి రామ్ నాయక్, షేక్ ఇస్మాయిల్‌లు అన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం రుద్దిన షరతులకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి విలువ ఆధారిత ఆస్తిపన్ను విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. మరోసారి ఆస్తిపన్నుల భారం పెంచారన్నారు. మూడేళ్ల కాలంలో 50 శాతం ఇంటి పన్నులను పెంచడం దారుణం అన్నారు. మరో రెండేళ్లలో పన్నులు రెట్టింపు చేసే కుట్రలు చేస్తున్నారన్నారు. ఎన్నడు లేనిరీతిలో రాష్ట్ర ప్రభుత్వం చెత్త పన్నుని విధిస్తున్నారని అన్నారు. వృద్ధులు, వితంతు పెన్షన్లు పొందే వారిని బెదిరించి మరీ వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.










