Aug 04,2023 20:18

ఉత్తమ సహకార సంఘం అవార్డును అందుకుంటున్న భానుముక్కల సహకార సంఘం అధ్యక్షులు నీలి శ్రీనివాసులు, కార్యదర్శి మునాఫ్‌

భానుముక్కల సహకార సంఘానికి ఉత్తమ అవార్డు
ప్రజాశక్తి - బనగానపల్లె

      పట్టణంలోని భానుముక్కల ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఉత్తమ అవార్డును అందుకుంది. శుక్రవారం విజయవాడలోని ఎ కన్వెక్షన్‌ హాల్‌లో ఎపి రాష్ట్ర కోఆపరేటివ్‌ బ్యాంకు 60 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి చేతుల మీదుగా భానుముక్కల ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు నీరు శ్రీనివాసులు, సీఈఓ అబ్దుల్‌ మునాఫ్‌లు ఉత్తమ అవార్డు, ప్రశంసపత్రంతో పాటు రూ. 50 వేలు నగదు ప్రోత్సాహాకాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సహకారంతో 2022-2023 ఆర్థిక సంవత్సరం రుణాలు, ఎరువుల పంపిణీ, లోన్స్‌ రికవరీ, గోల్డ్‌ లోన్స్‌ ప్రారంభించిన సంవత్సర కాలంలో కోటి రూపాయల టర్నోవర్‌ సాధించడంతో రాష్ట్రంలో మొదటి ఉత్తమ అవార్డు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్‌ ఎస్వి విజయ మనోహరి, కెడిసిసి బ్యాంకు సిఇఒ, డిసిసిబి డిపిడిఎం నాహీద సుల్తానా, డిసిసిబి డైరెక్టర్‌ సూర్య ప్రకాష్‌ రెడ్డి , డైరెక్టర్లు పాల్గొన్నారు.