కుందూ నదిలో దాహం తీర్చుకుంటున్న మూగజీవాలు
భానుడి ప్రతాపంతో తల్లడిల్లుతున్న మూగజీవాలు
ప్రజాశక్తి - బండి ఆత్మకూరు
భానుడి ప్రతాపంకు ప్రజలతో పాటు మూగ జీవాలు తల్లడిల్లుతున్నాయి. శుక్రవారం మేత కోసం వచ్చిన గొర్రెల మందలు సూర్య ప్రతాపాన్ని తట్టుకోలేక కుందున్నదిలో దాహం తీర్చుకొని నదిలోనే సేద తీరాయి. మండలంలో 40 డిగ్రీల ఉష్ణ్రోగ్రత నమోదు అయ్యింది. ఎండ తీవ్రతనుండి నుండి ప్రజలు రక్షణ చర్యలు తీసుకోవాలని ఉదయం 9 గంటల నుండి 12 గంటల లోపలనే తమ పనులు ముగించుకొని ఇళ్లకు చేరాలని, వేసవి తాపం తీరేందుకు చల్లని మజ్జిగ శీతల పానీయాలు సేవించాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.










