Oct 13,2023 21:40

భానుడి భగ భగలురైతన్నల్లో ఆందోళన

పులివెందుల టౌన్‌ : వాతావరణం వేసవి తలపిస్తుంది. మండుతున్న ఎండలతో జనం అల్లాడుతున్నారు. మరోవైపు పంటలు ఎండ తాకిడిని తట్టుకోలేక పోతున్నాయి. రైతన్నల్లో ఆందోళన మొదలైంది. మండుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. రెండు వారాలుగా ఎండ తీవ్రత జనాలను భయానికి గురి చేస్తుంది. శుక్రవారం పులివెందులలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఈ కాలంలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. సాధారణంగా సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలో వర్షాలు పడి వాతావరణం చల్లదనంతో ఉండాలి. కానీ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అక్టోబర్‌ రెండో వారంలోనే మండు వేసవిని తలపిస్తుంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి సూర్యుడి ప్రతాపంతో తీవ్ర వేడి ఇబ్బందులు పెడుతోంది. సాయంత్రం ఐదు గంటలకు వేడి గాలుల ఉండడంతో ఉక్కపోతతో జనాల అల్లాడుతున్నారు. పొలాల్లో ఉన్న తేమ శాతం ఎండ తీవ్రత కు ఆవిరైపోతుంది. పంటలు వాడు మొహం పెడుతున్నాయి , రైతన్నల్లో ఆందోళన మొదలైంది. రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రత తగ్గలేదంటే పరిస్థితి ఎంత భయానకారంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వర్షాలు పడితే ఉపశమనం కలుగుతుందని జనం ఆశిస్తున్న , వర్షం మాత్రం రావడం లేదు. కనీసం వాతావరణంలో మార్పు కనిపించకపోవడంతో జనాలలో మరింత ఆందోళన చెందినా చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.