ప్రజాశక్తి - రాయచోటి
సహకార బ్యాంకులు ప్రారంభించిన కిడ్డీ బ్యాంకును పిల్లలు, తల్లిదం డ్రులు వినియోగించుకోవాలని కలెక్టర్ గిరీష పిఎస్ సూచించారు. మంగళ వారం స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాల్‌లో 'భారత దేశ ఆర్ధిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్‌కు పెంచడంలో సహకార సంఘాల పాత్ర' అనే థీమ్ తో 70వ సహకార వారోత్సవాలను జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముందుగా భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రపటానికి శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ గిరీష్ పిఎస్, డిసిసి బ్యాంక్ చైర్మన్ ఝాన్సీ రాణి పూలమాలవేసి ఘనంగా నివాళు లర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ్ మాట్లాడుతూ జాతీయస్థాయిలో 70వ సహకార వారోత్సవాలు (14 నవంబర్ నుండి 20 నవంబర్) మన జిల్లాలో జరుపుకోవడం ఆనందంగా ఉంటున్నారు. సహకార బ్యాంకులు మంచి వద్ధి సాధించి వ్యవసాయ రంగంలో ఉండే వారికి రుణాలు ఎక్కువగా ఇచ్చి వారిని ఆదుకోవాలని సూచించారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చిన్న పిల్లలకు బ్యాంకు ఖాతాలను తెరిచి వారికి చిన్నతనం నుంచే డబ్బు విలువను తెలియజేసే కిడ్డీ బ్యాంక్‌ను ప్రారంభిస్తున్నందుకు జిల్లా సహకార బ్యాంకు మేనేజ్మెంట్ ని అభినందించారు. ప్రస్తుత విద్యా విధానంలో ఆర్థిక అవసరాలు భవిష్యత్తులో ఆర్థిక స్థితిగతుల గురించి అవగాహన తక్కువగా ఉందని, దీనిని పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. డిసిసిబి వారు ప్రారంభించిన కిడ్డీ బ్యాంక్ అనే వినూత్న కార్యక్రమం చాలా ఉపయోగకరమని చెప్పారు. శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త , ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో సహకార బ్యాంకుల సేవలు ఎంతో ప్రధానమని కొనియాడారు. కిడ్డీ బ్యాంక్ ద్వారా చిన్న పిల్లలు బ్యాంకు ఖాతాలను తెరిచి భవిష్యత్తు అవసరాలను తీర్చుకోవాలని సూచించారు. డిసిసిబి చైర్మన్ ఝాన్సీ రాణి క్రియాశీలకంగా పనిచేసే బ్యాంకుకు లాభాలు వచ్చే విధంగా కషి చేశారన్నారు. జిల్లా సహకార శాఖ అధికారి గురు ప్రకాష్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రతి జిల్లా లో డిసిసిబి బ్యాంకు ద్వారా 50 వేల ఖాతాలను తెరిచే లక్ష్యాన్ని నిర్దేశించారని, దానిని చేరుకునేందుకు అందరం కషి చేస్తామని చెప్పారు. డిసిసిబి చైర్మన్ మాట్లాడుతూ డిసిసిబి బ్యాంకును లాభాల బాటలో పయనించేందుకు సహకరించిన నాబార్డుకి కతజ్ఞతలు తెలియజేశారు. జాతీయస్థాయిలో సహకార బ్యాంకులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్ కి మొదటి ర్యాంకు వచ్చిందని గుర్తు చేశారు వారోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి అనుమతించిన కలెక్టర్‌కి కతజ్ఞతలు తెలియజేశారు. గతంలో అప్పుల్లో ఉన్న బ్యాంకును లాభాలలోకి తీసుకొచ్చామని తెలిపారు. డిసిసిబి బ్యాంకులలో ఈ స్టాంపింగ్ వంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయని ప్రజలందరూ వాటిని వినియో గించుకోవాలని సూచించారు. డ్వాక్రా రుణాలపై అత్యంత తక్కువ వడ్డీ 8.3 శాతానికి రుణాలు ఇస్తున్న బ్యాంక్ ఒక్క కడప డీసీసీ బ్యాంక్ మాత్రమే అని డ్వాక్రా సంఘాలు ఈ అవకాశం వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనం తరం జిల్లాలో బ్యాంకు ఖాతాలు తెరిచిన కొంతమంది చిన్న పిల్లలకు వారి పేరుతో కిడ్డీ బ్యాంక్ కిట్లను, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగులకు ఆరోగ్య బీమా కార్డులను ఎమ్మెల్యే, కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో నాబార్డ్ డిడిఎం విజయ విహారి, డిసిసిబి బ్యాంకు అధికారులు, కిడ్డీ బ్యాంకు ఖాతాలు తెరిచిన విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.