ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ఎమ్మిగనూరు టౌన్ బ్యాంకును అభివృద్ధి పథంలో నడపాలని జిల్లా సహకార అధికారి ఎన్.రామాంజనేయులు కోరారు. శుక్రవారం పట్టణంలో 70వ సహకార వారోత్సవాలు సందర్భంగా కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు కార్యాలయంలో ఛైర్మన్ యుకె.రాజశేఖర్ ఆధ్వర్యంలో నాలుగో రోజు టౌన్ బ్యాంకులో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా సహకార అధికారి ఎన్.రామాంజనేయులు సహకార సంఘ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి బ్యాంకును మంచి అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని తెలిపారు. పాలకవర్గం టౌన్ బ్యాంకు ఛైర్మన్ యుకె.రాజశేఖర్ సహకారంతో బ్యాంకు అభివృద్ధి దిశలో ముందుకు సాగుతుందని చెప్పారు. అతి త్వరగా మొండి బకాయిలు వేలం వేస్తామని తెలిపారు. డివిజన్ సహకార అధికారి (ఆదోని) వై.ఉమాదేవి, సీనియర్ ఇన్స్పెక్టర్లు రమాదేవి, రామరాజు, వెంకటసుబ్బయ్య, బ్యాంకు సిఇఒ గంగాధర్, డైరెక్టర్లు చాంద్ షేక్, వడ్డె రంగన్న, బుట్టా శ్రీరామ్, రజాక్, మహానందయ్య శెట్టి, బుడ్డప్ప, పల్లవి రాజశేఖర్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.