రాయచోటి ; జిల్లాలో బ్యాంకుల వారీగా ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ గిరీష బ్యాంక్ మేనేజర్లుకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకర్లతో డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ (డిసిసి), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (డిఎల్‌ఆర్‌సి) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని అందు కు సంబంధించి అర్హత పొందిన లబ్దిదారులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వారిని ఆర్ధికంగా నిలబె ట్టేందుకు ప్రవేశపెట్టిన 'పిఎంఇజిపి, పిఎంఎవై, స్టాండప్ ఇండియా, జగనన్న తోడు' పథకాలకు సంబంధించి అర్హత ఉన్న వారికి యువ పారిశ్రామిక, ఔత్సా హిక పారిశ్రామిక వేత్తలకు లబ్ధి చేకూరేలా అవకాశం కల్పించాలని చెప్పారు. జిల్లాలో స్టాండప్ ఇండియా పథకం లక్ష్య సాధన కోసం పూర్తి స్థాయి సహకారం అందించాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. ముద్ర స్కీము ద్వారా అర్హుల యిన వారందరికీ రుణాలను అందించడంలో బ్యాంకర్లు కృషి చేయాలని చెప్పా రు. జిల్లాలో 50 శాతం మంది పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని వీరికి పీఎంఈజిపి పథకంలో భాగంగా బ్యాంకులు పాడి పరిశ్రమకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. పాడి పరిశ్రమ అభివద్ధికి బ్యాంకర్లు అధికారులు కషి చేయాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధకం, చేనేత తదితర రంగా లపై దష్టి సారించి జిల్లా ఆర్థిక ప్రగతికి దోహదపడాలన్నారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల పథకాలను అర్హులయిన లబ్దిదారులకు అందేలా బ్యాంకు అధికారులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు కషి చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పేదలకు ఇళ్ళు పథకంలో గహ నిర్మాణం కోసం అదనంగా రుణాలు అవసరమైన మహిళలకు రుణ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల సభ్యు లందరికీ గృహరుణాలు మంజూరు చేసివారి ఆర్ధిక అభివద్ధికి సహకరిం చాలన్నారు. 2023- 24 ఆర్థిక సంవత్సరానికి గాను పిఎంఇజిపి ద్వారా 243 యూనిట్లకు గాను189 యూనిట్లు మంజూరు చేస్తారని తెలిపారు. 2023-24 జిల్లా క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వర రెడ్డి, పరిస్త్రమల శాఖ జిల్లా మేనేజర్ నాగరాజ, డిఅర్‌డిఎ పీడీ సత్యనారాయణ, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్ గిరీష










