బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోండివిశ్రాంత జస్టిస్ సివి.నాగార్జునరెడ్డి
వీరబల్లి : నూతనంగా ఏర్పాటైన ఎస్‌బిఐ బ్యాంకు సేవలను స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విశ్రాంత జస్టిస్ సివి.నాగార్జున రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని మారుమూల గ్రామమైన గడికోట గ్రామంలో ఎస్‌బిఐ కార్యాలయాన్ని ఎంపిపి రాజేంద్రనాథ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ఎపిఎస్‌పిడిసిఎల్ ఎండి కమలాకర్ బాబు, ఎన్‌ఆర్‌ఇడిసి ఎపిఎండి రమణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్రాంతి జస్టిస్ నాగార్జునరెడ్డి చొరవతో గడికోట గ్రామానికి ఎస్‌బిఐ సేవలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. గడికోట, యడబల్లి నుంచి గురుస్వామి దేవాలయం వరకు సిసి రోడ్డును ప్రారంభించారు. అక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలకు శాలువాలు కప్పి సన్మానించారు. మారుమూల గ్రామానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం రావడంతో అక్కడ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మదన్ రెడ్డి, ఎంపిపి గాలివీటి రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎంపిడిఒ మల్లేశ్వరి, రీజనల్ మేనేజర్, బ్యాంకు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.










