ప్రజాశక్తి-పాడేరు టౌన్: అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద మంగళవారం ఆర్థిక అక్షరాస్యత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆర్‌బిఐ రీజియన్ హెడ్ అనిల్, విజయనగరం రీజియన్ హెడ్ నరేష్ హాజరై మాట్లాడారు. ప్రజలు ఆర్థికపరమైన లావాదేవీలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బ్యాంకు సేవలు 100కు పైగా ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. యూనియన్ బ్యాంకుకు సంబంధించిన యూనో యాప్ ద్వారా బ్యాంకు లావాదేవీలను జరుపుకోవచ్చన్నారు. రుణాలను చెల్లించుటకు బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఈ యాప్ ద్వారా చెల్లించుకోవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ పివిఎస్‌ఎం రాజు, ఎల్.భానుచంద్ర, ఎల్ డిఎం రవితేజ, డ్వాక్రా మహిళలు, బ్యాంకు ఖాతాదారులు పాల్గొన్నారు..










