Sep 16,2023 00:24

ప్రజశక్తి - చీరాల
మండలంలోని ఔలు రైతులు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కావూరి రమణారెడ్డి అన్నారు. స్థానిక అగ్రికల్చర్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌలు రైతు కార్డు ఉన్నవారికి బ్యాంకులు పంట రుణాలు ఇస్తాయని అన్నారు. పంట నమోదు, సాగునీరు అంశాలపై వివరించారు. బోయినవారి పాలెం, చీరాల నగర్, ఈపురుపాలెం, విజయనగర్ కాలనీ పంచాయతీ రైతులు వరి పైరు వేసుకో వచ్చని అన్నారు. సమావేశంలో ఎఓ సుమత, నీటిపారుదల ఎఇ పవన్, మండల సభ్యులు గవిని యానాదిరావు, లేళ్ల మోష, గండూరి వెంకట్రావు పాల్గొన్నారు.