Mar 18,2023 01:14
బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర బాపట్ల పట్టణ శాఖ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఎస్పీ వకుల్‌ జిందాల్‌

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: బాపట్ల పట్టణ ప్రజలు బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ కోరారు. శుక్రవారం నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర బాపట్ల పట్టణ శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కార్యకలాపాలను ప్రారంభించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రకు భారతదేశం వ్యాప్తంగా అనేక బ్రాంచ్‌లు ఉన్నాయన్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర వారు అందించే సేవలు ఉన్నతంగా ఉంటాయని అన్నారు. బాపట్ల ప్రజలు వారి ధనాన్ని డిపాజిట్‌ చేసుకోవడానికి, వివిధ రకాలైన రుణ సదుపాయాలు పొందడానికి సౌకర్యవంతమైన సేవలు అందిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. బాపట్ల పట్టణ ప్రజలు బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర వారు అందించే సేవలను సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బి ఇన్‌స్పెక్టర్‌ ఎ శ్రీనివాస్‌, బాపట్ల పట్టణ ఇన్‌స్పెక్టర్‌ పి కృష్ణయ్య, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర జోనల్‌ మేనేజర్‌ జిఎస్‌డి ప్రసాద్‌, డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ ఎ రజనీ కుమార్‌, బాపట్ల బ్రాంచ్‌ మేనేజర్‌ హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.