బ్యాడ్మింటన్ క్రీడలో
'స్విమ్స్' విద్యార్థుల ప్రతిభ
ప్రజాశక్తి- తిరుపతి సిటీ: శ్రీవేంకటేశ్వర వైద్యవిజ్ఞాన సంస్థ (స్విమ్స్) యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరఫి విద్యార్థులు ఐఐటి ఏర్పేడు తిరుపతి జిల్లాలో మూడు రోజుల పాటు నిర్వహించిన సన్యోగ్ - 2023 ఇన్విటేషనల్ ఇంటర్ కాలేజీయేట్ షట్టలే బాడ్మింటన్ (ఉమెన్స్) ఛాంపియన్స్‌లో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరఫీ విద్యార్థులు రన్నర్స్ ఛాంపియన్స్‌గా నిలచారని స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. స్విమ్స్ సంచాలకులు ఉపకులపతి డాక్టర్ ఆర్‌వి.కుమార్ మాట్లాడుతూ క్రీడలు, వ్యాయం అనేది మానవ జీవితంతో విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. మానసిక, శారీరక ఆనందానికి ఇవి ఎంతగానో దోహదపడుతాయని తెలియజేశారు. కార్యక్రమంలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరఫి ప్రిన్సిపల్ డాక్టర్ కె.మాధవి, ఫిజికల్ డైరెక్టర్ మధుబాబు తదితరులు పాల్గొన్నారు.










