Jun 23,2023 21:42

హత్యకు గురైన శ్రీనివాసులరెడ్డి

డప అర్బన్‌ : కడప నగరం లో పట్ట పగలే నడిరోడ్డుపై దారుణ హత్య కలకలం రేపింది. వైసిపి కార్యకర్తను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి అతిదారుణంగా హత్య చేశారు. ఆర్టీసి చైర్మన్‌ దుగ్గా యపల్లి మల్లికార్జునరెడ్డికి ప్రధాన అనుచరుడైన శ్రీనివాసులరెడ్డి(42) ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురి కావడం కడప నగరంలో సంచలనం కల్గించింది. నగరంలోని సంధ్యా సర్కిల్‌ ఉన్న జిమ్‌లో వ్యాయామం ముగించుకుని ఇంటికి వెళుతున్న అతన్ని అటుగా బైక్‌పై గుర్తు తెలియని వ్యక్తులు బురఖాలతో వచ్చి వేట కొడవలితో దాడి చేశారు. దాడిలో ఒంటిపై బలమైన గాయాలు కావడంతో స్థానికులు 108 ద్వారా హుటాహుటిన రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మతి చెందాడు. శ్రీనివాసులరెడ్డికి కొంత మంది వ్యక్తులతో ఉన్న భూతగాదాలే హత్యకు కారణమని తెలుస్తోంది. సిసి పుటేజీ ఆధారంగా పోలీసులు నింది తుల కోసం గాలిస్తున్నారు. మత దేహాన్ని ఆర్‌టిసి చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి, కమలా పురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి సందర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. హత్య వెనుక ఎవరున్నారో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రవీంద్ర నాథ్‌రెడ్డి పోలీసులను ఆదేశించారు. వైసిపి సీరియస్‌ కార్యకర్తగా పనిచేయడం వల్లే ప్రత్యర్థులు చంపేశారన్నారు. శ్రీనివాసులరెడ్డి హత్యా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
డిగ్రీ పరీక్షలు తనిఖీ
కడప అర్బన్‌ : యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ పరీక్షలను విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎన్‌. ఈశ్వర్‌ రెడ్డి తనిఖీ చేశారు. విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ రెండు నాలుగు ఐదు సెమిస్టర్ల విద్యార్థులకు, ఆరో సెమిస్టర్‌ బ్యాక్లాగ్‌ విద్యార్థులకు శుక్రవారం నుంచి పరీక్షలు 57 పరీక్ష కేంద్రాలలో మొదలయ్యాయి. పరీక్షలకు 42,300 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆచార్య ఎన్‌. ఈశ్వర్‌ రెడ్డి నగరంలోని శ్రీహరి డిగ్రీ కాలేజ్‌, నాగార్జున డిగ్రీ కాలేజ్‌, ఖాజీపేట లోని సాహిత్య డిగ్రీ కాలేజ్‌ పరీక్షలను ప్రత్యక్షంగా పరిశీలించారు. పరీక్ష కేంద్రాల చీఫ్‌ డిపార్ట్మెంటల్‌ ఆఫీసర్లతో మాట్లాడారు.
రుణ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి : జిఎం
ప్రజాశక్తి - కడప
కెనరా బ్యాంకు అందిస్తున్న వివిధ రకాల అరుణ సౌకర్యాలను సద్వి నియోగం చేసు కోవాలని విజయవాడ కెనరా బ్యాంక్‌ సర్కిల్‌ ఆఫీస్‌ జనరల్‌ మేనేజర్‌ పి. రవి వర్మ సూచిం చారు. కెనరా బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం కడప వారి ఆధ్వర్యంలో శుక్రవారం రిటైల్‌, వ్యవసాయ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రుణాలకు సంబంధించిన విషయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామిక వ్యక్తులు, ఐఎఎల్‌ఎ, ఎపిఐఐసి, ఐఎల్‌ఐఎ కొప్పర్తి, ప్రముఖ వైద్య నిపుణులకు, వివిధ వ్యాపారవేత్తలు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిటైల్‌, వ్యవసాయ, పారిశ్రామిక వ్యాపారులకు సంబంధించి కెనరా బ్యాంకు అందిస్తున్న వివిధ రకాల రుణ కార్యక్రమాలను సమావేశానికి హాజరైన ప్రముఖులకు వివరించారు. కడప కెనరా బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ కె. మురళీ మోహన్‌ మాట్లాడుతూ కడప జిల్లాలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు కెనరా బ్యాంకు ఎప్పుడు రుణాలను అందించడంలో ముందుంటుందని తెలిపారు. సమావేశంలో వివిధ ఖాతాదారులకు ఎంఎస్‌ఎం ఈ రుణాలు, ఇళ్ల రుణాలు, విద్యా రుణాలు, వాహనా వ్యక్తిగత రుణాలకు సంబంధించిన మంజూరు పత్రాలను జనరల్‌ మేనేజర్‌ పి. రవివర్మ చేతుల మీదుగా పంపిణీ చేశారు. సమావేశానికి ఏపీఐఐసీ చీఫ్‌ అడ్వైజర్‌, కెనరా బ్యాంక్‌ డివిజనల్‌ మేనేజర్‌ ఏ.వి. రాజశేఖర్‌, డిఎం లు ఎం. ఆయుబ్‌, ఎస్‌. రమేష్‌, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తాం : కాంగ్రెస్‌
కడప : రాష్ట్రంలోనూ దేశంలోనూ కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభం తీసుకొచ్చేందుకు కషి చేస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. శుక్రవారం సాయంత్రం కడపకు వచ్చిన ఆయన సిపి బ్రౌన్‌ లైబ్రరీని సందర్శించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి జిల్లాలోని సమన్వయ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తాను కడప జిల్లాకు వచ్చినట్లు తెలిపారు. సి పి బ్రౌన్‌ లైబ్రరీ సందర్శించిన వారిలో మేయ్యప్పన్‌, ఎపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంగా గౌతమ్‌, నర్రెడ్డి తులసిరెడ్డి, డెలికేట్‌ బండి శేఖరయ్య ఉన్నారు.