
ప్రజాశక్తి -సీతానగరం : మండలంలోని బూర్జిలో మంగళవారం బాబు ష్యూర్టీ... భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామంలో టిడిపి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బోనెల విజరు చంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపే రోజులు దగ్గర పడ్డాయన్నారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్ష కార్యదర్శులు కె.తిరుపతిరావు, ఆర్.వేణుగోపాల్ నాయుడు, గొట్టాపు వెంకట నాయుడు, గ్రామ కమిటీ నాయకులు రెడ్డి అన్నంనాయుడు, కల్యాణ్, బలరాంతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని కొండవాడ పంచాయతీ ఆలవడ్డలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కురుపాం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి తోయక జగదీశ్వరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామ కమిటీ అధ్యక్షులు సురేష్, యూనిట్ ఇన్చార్జ్ చిన్న, గుమ్మలక్ష్మీపురం బూత్ ఇన్‌ఛార్జి రాజేష్, ఎల్విన్ పేట బూత్ ఇన్‌ఛార్జి బాల, తాడికొండ యూనిట్ ఇన్చార్జ్ నరేష్, వాడబ్బాయి గ్రామ కమిటీ అధ్యక్షులు కామేష్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీతంపేట: మండలంలోని కుమ్మరగండిలో పాలకొండ నియోజకవర్గం ఇంచార్జ్ నిమ్మక జయకష్ణ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి బాబు షఉరిటీ -భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జయకష్ణ మాట్లాడుతూ మినీ మేనిఫేస్టోలోని సూపర్ సిక్స్ అంశాలును వివరిస్తూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబునాయుడు గారు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాష్ట్ర పరిస్థితులను అధ్యయనం చేస్తున్న ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారేనని పేర్కొన్నారు. చంద్రబాబు గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైపా ఉందని అన్నారు. రాష్ట్రంలో పరిపాలన సక్రమార్గంలో ఉండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా మళ్లీ రావాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందులకు కార్యకర్తలు, నాయకులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. కార్యక్రమం రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు గొట్టిముక్కల కోటేశ్వరరావు,క్లస్టర్ ఇంచార్జ్ నిమ్మక చంద్రశేఖర్,శిల్లా గుప్తా,మాజీ సర్పంచ్ సవర నారాయణ రావు,సవర ఇశ్రాయేల్ సవర రజిని,సవర సంజరు,సవర గంగరావు,మరియు గ్రామా పెద్దలు,మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు..