బురద రోడ్డుపై వరి నాట్లు వేస్తున్న టిడిపి నాయకులు
ప్రజాశక్తి-పాలకొండ రూరల్ : మండలంలో అధ్వానంగా ఉన్న రోడ్లను టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మక జయక్రిష్ణ ఆధ్వర్యంలో బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బురదమయంగా ఉన్న రోడ్డుపై వినూత్నరీతిలో నాట్లు వేస్తూ నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా కనీసం రోడ్ల వైపు చూడటం లేదన్నారు. ఓని రోడ్డు చూస్తే దారుణంగా తయారైందన్నారు. ఓని గ్రామానికి మండల నిధుల నుంచి రెండు లక్షల రూపాయలు కేటాయించినా గ్రావెల్ ఉపయోగించకుండా మట్టి పోయడంతో రోడ్డు అధ్వాన స్థితికి చేరుకుందన్నారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కె.అప్పలనాయుడు, మండల అధ్యక్షులు గండి రామినాయుడు, మాజీ సర్పంచ్ కోట సంఘంనాయుడు, మామిడి ధనుంజరు పాల్గొన్నారు.










