ప్రజాశక్తి- సీతమ్మధార : బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ (బిపిఎం) శిక్షణకు దేశంలో నాస్కం ఎంపిక చేసిన పది కళాశాలలో ఎపి నుంచి బుల్లయ్య కళాశాల ఒక్కటే ఉండడం సంతోషంగా ఉందని కళాశాల కరస్పాండెంట్ జి మధుకుమార్ అన్నారు. గురువాదరం నాస్కం, కాన్స్ట్రిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో కళాశాలలో నిర్వహించిన బిపిఎంశిక్షణ ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యార్థులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా రాణించాలన్నారు. నాస్కం డిప్యూటీ డైరెక్టర్ సతీష్ కుమార్ దాంట్ల మాట్లాడుతూ డబ్ల్యూఎన్‌ఎస్, ఇన్ఫోసిస్, ఈ ఎక్సెల్, ఫస్ట్ స్టోర్స్ వంటి ప్రముఖ ఐటి కంపెనీలకు అవసరమైన నైపుణ్యం కలిగిన అభ్యర్థులను ఎనిమిది వారాల శిక్షణ ద్వారా తయారుచేసి అందిస్తామన్నారు. 2000లో ఇదే కాలేజీల బీకాం చదివిన తాను, ఇపుడు ఈ కాలేజీ విద్యార్థులకు ఉద్యోగావకాశాలను కల్పించేందుకు బిపిఎం శిక్షణకు రావడం అనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో కాన్స్టిక్స్ ఆపరేషన్ డైరెక్టర్ సంపత్ నంది, కస్టమర్ సక్సెస్ మేనేజర్ ఎ. సతీష్ పాల్గొన్నారు.










