Sep 28,2023 19:01

మాట్లాడుతున్న డాక్టర్‌ వేణుగోపాల్‌


మాట్లాడుతున్న డాక్టర్‌ వేణుగోపాల్‌
బూదవాడలో రచ్చబండ
ప్రజాశక్తి-మర్రిపాడుఉదయగిరి జిల్లా సాధన కమిటీ మండలం బూద వాడలో రచ్చబండ కార్యక్రమంను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఉదయగిరి జిల్లా సాధన కమిటీ అధ్యక్షులు డాక్టర్‌ కె. వేణుగోపాల్‌ పాల్గొని మాట్లాడారు. అధికార వికేంద్రీకరణ ద్వారా అభివద్ధి సాధ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి 26 జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు. చిన్న జిల్లాల ద్వారా అభివద్ధి జరుగుతుందని ఉదయగిరి ప్రాంతం ఏ జిల్లా కేంద్రానికైనా 150 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు.
కాబట్టి ఏ సమస్య పరిష్కారానికి వెళ్లాలన్నాప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నప్రజల జీవనస్థితిగతులతో మన ప్రాంతంలో ఉన్న ప్రజల జీవితాలను పోల్చుకుంటే మనం ఎంతో వెనుకబడి అధ్వానపు జీవితాన్ని గడుపుతున్నామన్నారు.కార్యక్రమంలో ఉదయగిరి జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్‌ దస్తగిరి అహ్మద్‌, గ్రామ సర్పచ్‌ హరిబాబు, గ్రామ వైద్యులు శ్రీరాములు, రబ్బాని దాదా, మురళి, మహిళలు పాల్గొన్నారు.