
రోడ్డును చూపిస్తున్న కాలనీ వాసులు
ప్రజాశక్తి -ఆనందపురం : ఆనందపురం పంచాయతీ పరిధిలో ఉన్న బుడగ జంగాల కాలనీకి రోడ్డు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆనందపురం జగనన్న కాలనీ వరకు రోడ్డు వేసి సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉన్న బుడగ జంగాల కాలనీకి రోడ్డు వేయలేదని గ్రామస్తులు జిల్లా జాయింట్ కలెక్టర్ కె.విశ్వనాధన్‌కు ఇటీవల జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. ఈ కాలనీలో సుమారు 100 కుటుంబాలకు పైగా జీవనం సాగిస్తున్నాయి. కాలనీ కొండిపాంతంలో ఉండడంతో చిన్నపాటి వర్షం పడినా రాళ్లు తేలుతుండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురవుతున్నారు. సిసి రోడ్డుగా వేయాలని కాలనీ ప్రెసిడెంట్ అప్పలస్వామి, నాగరాజు, గౌరీశ్వరరావు, అప్పారావు, వెంకట్, సంతోష్, బంగారి, గ్రామస్తులు కోరుతున్నారు.