Jul 26,2023 19:57

ఖాళీగా కూర్చున్న చెప్పులు కుట్టేవారు

ప్రజాశక్తి - చిలకలూరిపేట : రోజువారీ ఏదో ఒక పని చేసుకుంటేగాని ఇల్లు గడవని పేదలు వర్షాల నేపథ్యంలో ఉపాధికి దూరమయ్యారు. వారం రోజులుగా వర్షాల నేపథ్యంలో కూలీలు, వీధి విక్రేతలు, చిరు వ్యాపారులు, వివిధ వృత్తుల వారు పనులకు దూరమై ఆర్థిక ఇబ్బందులు ఏదుర్కొంటున్నారు. రోజంతా చిరు జల్లుల వల్ల ప్రజల ఇళ్ల నుండి బయటకు రావడానికే అవకాశం ఉండడం లేదు. దీంతో చిరు వ్యాపారులు, వీధి విక్రేతలకు బేరాలు తగ్గాయి. చెప్పులు కుట్టుకునే వారికి, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులకు పనులే లేవు. రిక్షా, ఆటో కార్మికులకూ బాడుగల్లేవు. ఈ నేపథ్యంలో వీరికి జీవన భృతి కింద పది రోజులకు సరిపడ బియ్యం, నూనెలు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలను ప్రభుత్వం పది రోజులపాటు ఇవ్వాలని సిఐటియు మండల కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు కోరారు.