ఆశల బండిలో పయనించే జీవితమా
ఇంత చిన్న కష్టానికే
చతికిలపడితే ఎలా....?
ఆకాశంలో తారలన్నీ రాత్రిపూట
మిణుకు మిణుకుమని
ప్రకాశించినట్లు....
నీ జీవితానికి కూడా
వెలుగులు విరజిమ్మే ఘడియలు
ముందరున్నాయని
మరచిపోతే ఎలా....?
గుండెలో దాగివున్న
చిమ్మచీకటిని చూసి...
అక్కడే కూర్చుండిపోతే ఎలా...?
ఆ చీకటిని చీల్చే గుండె ధైర్యం
నీ గుండెలోనే ఉందని
మరచిపోతే ఎలా....?
మేఘాలెన్ని అడ్డొచ్చినా
భానుడు ప్రకాశించడం
మర్చిపోతాడా..?
జీవకోటికి వెలుగులు
పంచడం ఆపేస్తాడా...?
నల్లని మబ్బులన్నీ తాత్కాలికమే.
కష్టాల కన్నీళ్లు కూడా.
చెట్టుపై ఎండిన ఆకులు
ఒక్కొక్కటి రాలిపోతుంటే
చెట్టేనాడైన కృంగిపోతుందా...?
తన తనువులోంచి ఆశలు అనే
కొత్త చిగురులను
చిగురిస్తుంది కదా...?
పది మందికి నిలువనీడై
నిలుస్తుంది కదా..?
నీ ఎదలో ప్రయత్నం అనే
దీపాన్ని వెలిగించు.
అది చీకటిని చీలుస్తూ....
ఈ విశాలమైన విశ్వాన్ని
నీకు చూపెడుతుంది.
అవకాశాల్ని అందిస్తుంది.
అందరికీ నిన్ను ఆదర్శంగా
నిలుపుతుంది.
- అశోక్ గోనె
9441417361