Dec 30,2022 23:00

బతికున్నప్పుడే బంధాలను తెంపుకుంటూ...

బతికున్నప్పుడే బంధాలను తెంపుకుంటూ...
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో

కొన ఊపిరితో బతుకు... పుట్టినూళ్లోనే తనువు చాలించాలనే ఆశా ఉంటుంది.. అయితే కొత్తనెన్నూరు గ్రామంలో స్మశానం లేదు.. పోయాక సమస్యలు తెచ్చుకోవడం ఎందుకని బతికుండగానే బంధాలను తెంపుకున్నాడు. పుట్టి పెరిగిన ఊరు వదులుకుని బంధువుల చెంతకు చేరాడు. ఇది కొన ఊపిరితో ఉన్న చందా సాహెబ్‌ దీనగాథ.
తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం నెన్నూరు పంచాయతీ కొత్త నెన్నూరులో అమానుషం చోటు చేసుకుంది. గ్రామంలో స్మశాన స్థలం లేకపోవడంతో కొన ఊపిరితో ఉన్న చందా సాహెబ్‌ అనే వ్యక్తిని కుటుంబ సభ్యులు బంధువుల గ్రామమైన దామలచెరువుకు తీసుకెళ్లారు. ఈ సంఘటనతో గ్రామంలోని ప్రజలందరూ కంటతడిపెట్టారు. పుట్టినప్పటి నుండి గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉండి చనిపోయేటప్పుడు స్మశాన స్థలం లేక తన బంధువుల ఇంటికి తీసుకెళుతుండడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.