Aug 31,2023 23:57

ప్రజాశక్తి - భట్టిప్రోలు
స్థానిక బస్టాండ్ సెంటర్లో ఏర్పడిన గుంటలను పంచాయతీ కార్యదర్శి కోట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పంచాయతీ పారిశుద్ధ కార్మికులతో గురువారం పూడిపించారు. కొన్ని నెలలుగా ఏర్పడిన గుంటలతో ప్రయాణికులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. చెరుకుపల్లి, రేపల్లె, వెల్లటూరు, తెనాలి ప్రాంతాలకు వెళ్లే వాహనచోదకులను ఈ గుంటలు తీవ్ర అవస్థలకు గురిచేస్తున్నాయి. రాత్రి సమయంలో గుంటలు కనిపించక వాహనాలు ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి. గుంటలు పూడ్చడంపట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు సలీం, వైసీపీ యువజన విభాగం నాయకులు పి అరుణశాస్త్రి, శ్రీనివాసరావు ఉన్నారు.
సర్పంచికి తెలియకుండానే....
గ్రామ సర్పంచికి తెలియకుండా కార్యదర్శి కోట శ్రీనివాసరావు వివిధ పనులు చేస్తున్నారని సర్పంచి ధారా రవికిరణ్మయి ఆరోపించారు. కొందరు ఉన్నతవర్గానికి చెందిన పాలకవర్గ సభ్యులతో కలిసి దళితురాలైన తనను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. కార్యదర్శి ఏకపక్ష నిర్ణయాలతో గ్రామంలో పాలన కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు.