Jan 06,2023 23:59

ర్యాలీ చేపడుతున్న విద్యార్థులు

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌:రావికమతం, తోటపూడి , ఎస్‌ఆర్‌ పేట తదితర ప్రాంతాలకు సకాలంలో బస్సులు నడపాలని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ సభ్యులు, విద్యార్థులు ర్యాలీగా వచ్చి ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గీతాకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ, ఉదయం, సాయంత్రం బస్సులు సకాలంలో రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా చూడాలని కోరారు. మేనేజర్‌ స్పందిస్తూ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శేఖర్‌, సిద్ధార్థ ధర్మేంద్ర, తారక్‌, రాజేష్‌ పాల్గొన్నారు.