Nov 02,2023 23:53
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి

ప్రజాశక్తి-పొదిలి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు ఉద్దేశించిన సామాజిక సాధికార బస్సు యాత్రను జయప్రదం చేయాలని, వై ఏపీ జగన్‌ నీడ్స్‌ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మార్కాపురం శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక దరిశి రోడ్డులోని వైసిపి కార్యాలయంలో పొదిలి పట్టణ, మండల వైసిపి నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఆరో తేదీన నియోజకవర్గ కేంద్రమైన మార్కాపురంలో జరుగు సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమాల విజయవంతానికి ఆయన నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి గ్రామం నుంచి ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన అన్ని సామాజిక వర్గాల వారిని చైతన్యపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మర్రిపూడి ఎంపిపి వాకా వెంకటరెడ్డి, వైసిపి రాష్ట్ర కార్యదర్శి సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ కసిరెడ్డి వెంకట రమణారెడ్డి, జిల్లా కార్యదర్శి గొలమారి చెన్నారెడ్డి, జిల్లా ఆహార సలహా సంఘం సభ్యులు కొండ్రగుంట సుబ్బారావు, పొదిలి మాజీ ఏఎంసి ఛైర్మన్‌ గుజ్జుల రమణారెడ్డి, మాజీ ఎంపిపి, జడ్‌పిటిసి కోవెలకుంట్ల నరసింహారావు, సాయి రాజేశ్వరరావు, మండల కన్వీనర్‌ దుగ్గెంపూడి శ్రీనివాసరెడ్డి, పట్టణ వైసిపి అధ్యక్షురాలు ఎస్‌కె నూర్జహాన్‌ బేగం, రూరల్‌ గ్రామ సచివాలయ కన్వీనర్‌ పేరం సుభాష్‌ చంద్రబోస్‌ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు జి శ్రీను, మాజీ మండల కోఆప్షన్‌ సభ్యులు ఎస్‌కె మస్తాన్‌ వలి, శివాలయం ట్రస్టు బోర్డు ఛైర్మన్‌ యక్కలి శేషగిరిరావు, నగర పంచాయతీ బిసి, ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు పులగొర్ల శ్రీనివాసులు, మల్లాపురం చిన నరసింహాలు, గూడూరి వినోద్‌ కుమార్‌, ఉలవా గోపి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఆవుల వెంకట సుబ్బారెడ్డి, చిరుమామిళ్ల శ్రీనివాసులు, సచివాలయ కన్వీనర్‌లు, గృహ సారథులు పాల్గొన్నారు.