Nov 06,2023 00:35

విలేకర్లతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ముస్తఫా

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : వైసిపి నిర్వహిస్తున్న సామాజిక సాధికారిక బస్సు యాత్రలపై టిడిపి నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్‌ ముస్తాఫా అన్నారు. ఆదివారం సాయంత్రం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరులో శనివారం సాయంత్రం జరిగిన బస్సు యాత్రలో జనం లేరని టిడిపి నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. సభ ముగిసిన తరువాత వారికి అనుకూల మీడియా సంస్థలతో ఫొటోలు తీయించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమం నాలుగు గంటల పాటు జరగగా ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యాని, ఇది ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఏ సభ జరిగినా ముగింపు దశలో ప్రజలకు బయటకు వెళ్లడం సహజమని, దీనిని జనం రాలేదన్న భావనతో ప్రచారం చేయడం ఏ మేరకు సబబని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు కిలోమీటర్లకుపైగాభారీ ర్యాలీ జరిగిందని వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి నూరి ఫాతిమా అన్నారు. బస్సు యాత్రకు వేలాదిమంది అభిమానులు వచ్చారని అన్నారు.