పోలీసులతో మాట్లాడుతున్న మాజీ మంత్రులు రాజేంద్ర, పుల్లారావు
ప్రజాశక్తి - అచ్చంపేట : టిడిపి చేపట్టిన బస్సు యాత్రకు కొత్తపల్లిలో అనుమతులు లేవంటూ పోలీసులు అచ్చంపేట మాదిపాడు రోడ్డులో జడ్పీ కాంప్లెక్స్ వద్ద శుక్రవారం బారీకేడ్లు ఏర్పాటు చేశారు. సాయంత్రానికి యాత్ర క్రోసూరు నుండి వేల్పూరు వద్దకు రాగానే గజమాలతో టిడిపి నాయకులకు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడనుండి అచ్చంపేటకు చేరుకొని కొత్తపల్లి వెల్లే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టిడిపి జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు, మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ రోడ్డుపై బైఠాయించారు. కొంతసేపు ఉద్రిక్తత అనంతరం అక్కడనుండి పెదపాలెంలో జరిగే బహిరంగ సభకు యాత్ర వెళ్లింది. మరోవైపు బారీకేడ్ల ఏర్పాటుతో వాహనదారులు, బాటసారులు ఇబ్బంది పడ్డారు.










