Feb 24,2023 21:37

ప్రజాశక్తి-విజయవాడ: రాష్ట్రంలోని వంద ఎపిఎస్‌ఆర్‌టిసి బస్‌స్టేషన్‌ల ప్రయివేటీకరణ ఆపాలని డిమాండ్‌ చేస్తూ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యుఎఫ్‌) ఆధ్వర్యంలో స్థానిక పిఎన్‌ బస్‌స్టేషన్‌ ప్రాంగణంలో శుక్రవారం ధర్నా జరిగింది. జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్‌కె జిలానీభాషా మాట్లాడుతూ ్‌ఆర్‌టిసి బస్‌స్టేషన్లను లీజు పేరుతో ప్రయివేటు సంస్థలకు, కార్పొరేట్‌ వ్యక్తులకు ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ సన్నాహాలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎడిరావు, గ్జావియర్‌, శ్రీనివాసరావు, బిడిఆర్‌ రెడ్డి, మురహరిరావు పాల్గొన్నారు.