Nov 28,2022 23:31

బస్‌షెల్టర్‌ ప్రారంభిస్తున్న ఆనందకుమార్‌

ప్రజాశక్తి - ములగాడ: కోరమండల్‌ ఫెర్టిలైజర్స్‌ సౌజన్యంతో శ్రీహరిపురంలో నిర్మించిన బస్‌షెల్టర్‌ను వార్డు కార్పొరేటర్‌, స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పివి.సురేష్‌ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్‌కుమార్‌ సోమవారం ప్రారంభించారు, తర్వాత 59, 60వార్డుల్లో నాడునేడు అభివృద్ధి పనులు, సిసిరోడ్ల నిర్మాణాలను పరిశీలించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షులు కలిదిండి బద్రీనాథ్‌ 40వ వార్డు కార్పొరేటర్‌ గుండపు నాగేశ్వరరావు, 61 వార్డు కార్పొరేటర్‌ కొణతాల సుధా, కోరమండల్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్స్‌ కె. రంగకుమార్‌, జివిఎస్‌ రాజా, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఎం శ్రీనివాసరావు రేవల్లు సత్యనారాయణ, పిలకా రామ్మోహన్‌ పాల్గొన్నారు.