'బషీర్బాగ్' నేటి ప్రభుత్వానికి కనువిప్పు కావాలి
- అమరులకు జోహార్లు : సిపిఎం
ఉద్యమ స్ఫూర్తితో
మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం కావాలి :
ప్రజాశక్తి - ఆత్మకూరు
నాటి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రపంచ బ్యాంకు కోరల్లో చిక్కుకోకుండా కాపాడిన మహత్తరమైన ఉద్యమం బషీర్‌బాగ్ ఉద్యమం అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి. యేసు రత్నం, పట్టణ కార్యదర్శి ఏ. రణధీర్, మండల కార్యదర్శి నరసింహ నాయక్, సీనియర్ నాయకులు ఎం. రజాక్ లు అన్నారు. సోమవారం పట్టణంలోని డాక్టర్ ఎ ధనుంజయ మీటింగ్ హాల్ నందు బషీర్బాగ్ విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామిల 23వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరెంటు చార్జీల పెంపుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం చంద్రబాబు కర్కశ త్వానికి నిజరూపం అన్నారు. నేడూ రాష్ట్ర ప్రభుత్వం మరో మారు ప్రజలపై వేస్తున్న విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్ర మంలో సీనియర్ పాత్రికేయులు కే జోసెఫ్ చంద్రశేఖర్, సిపిఎం నాయ కులు మా బాష, డి రామ్ నాయక్, ఏ సురేంద్ర, రోషన్ వలి, గణపతి, సామేలు, శ్రీనివాసులు,అతావుల్లా, కలీముల్లా,ఖాదర్,రజ్వి, ఉమ్మర్,రెడ్డి, జబివుల్ల,తదితరులు పాల్గొన్నారు.
నందికొట్కూరు టౌన్ : బషీర్బాగ్ విద్యుత్ పోరాటంలో అమరులైన రామకష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి ,బాల స్వాముల 23వ వర్ధంతి సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు, సిపిఎం నాయకులు కే భాస్కర్ రెడ్డి, పి పకీర్ సాహెబ్, గోపాలకృష్ జోహార్లు అర్పించారు. స్థానిక భరత్ కాంప్లెక్స్‌లో విద్యుత్ అమరవీరుల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం విద్యుత్ అమరవీరుల సంస్కరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలో పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని లేనిపక్షంలో గత ప్రభుత్వాలకు పట్టిన గతి పడుతుందని వారు హెచ్చరించారు. సిపిఎం నాయకులు ఎస్ బాలయ్య, టి ఓబులేసు, వీ ఆంజనేయులు, సి నాగన్న ,మహిళా సంఘం నాయకులు సాజిదాబి, బిబి, సిఐటియు నాయకులు నరసింహులు, ఏసన్న ,రామిరెడ్డి, మా బాష తదితరులు పాల్గొన్నారు. వెలుగోడు: విద్యుత్ పోరాటంలో అమరులకు సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు నాగమోహన్, తాళ్ల శ్రీనివాసులు నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు.
పాములపాడు : బషీర్బాగ్ విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాల స్వాముల 23వ వర్ధంతిని మండలంలోని లింగాల గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్బంగా అమరుల చిత్రపటాలకు పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సిపిఎం సీనియర్ నాయకులు బి రామేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సామన్న, నాయకులు వెంకటేశ్వరరావు, రవణమ్మ, బాల యేసు, ఆనంద్ గౌడ్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.
బేతంచర్ల : బేతంచెర్ల పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో సిఐటియు పట్టణ ఉపాధ్యక్షుడు బి.రామాంజనేయులు అధ్యక్షతన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వై ఎల్లయ్య, సిఐటియు పట్టణ కార్యదర్శి బి.సంజీవ నాయుడు విద్యుత్ అమరవీరుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలను నియంత్రించి, విద్యుత్ చార్జీలను తగ్గించి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. డివైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి మధు శేఖర్, సిఐటియు నాయకులు శ్రీనివాసులు, బాలకృష్ణ, సోమ నాయుడు, రాజబాబు, వెంకటరమణ, జాకీర్ హుస్సేన్, నాగరాజు, కలాం తదితరులు పాల్గొన్నారు.










