
ప్రజాశక్తి -అరకులోయ :నవంబర్ 2 న ప్రజా రక్షణ బేరి బస్సు యాత్రను విజయవంతం చేయాలని అరకులోయ మండలం లో నాయకులు కార్యకర్తలు బైక్ యాత్ర నిర్వహించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.రామారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా రక్షణ బేరి పేరుతో సిపిఎం చేపట్టిన బస్సు యాత్ర అరకులోయ మండల కేంద్రంలో నవంబర్ 2న గురువారం చేరుకుంటుందన్నారు. కాపీ రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలన్నారు. మిరియాలు కిలో రూ.1000, కాపీ ధర కిలో రూ.500, కాఫీ పళ్ళు రూ.100 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.విద్య, వైద్యం పేదలకు ఉచితంగా అందించాలన్నారు. పండించిన పంటలకు గిట్టు బాటు ధర, కోల్డ్ స్టోరేజ్ వంటి సమస్యలు పరిష్కారం చేయాలన్నారు. అటవీహక్కుల చట్టం ప్రకారం ప్రతి ఒక్కరికి పోడు పట్టాలు మంజూరు చేయాలని, జీవో 3కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో చెక్ డ్యాముల మరమ్మతు చేయాలన్నారు.మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు సిహెచ్ గురుమూర్తి, జె.భగత్ రామ్, నానిబాబు, మగ్గన్నా, రామన్న, కె.మొద్దు, కుమారి, బాలక్రిష్ణ, దొన్ను,తదితరులు పాల్గొన్నారు.
పెదబయలు: ప్రజా రక్షణ బేరి యాత్రను జయప్రదం చేయాలని మండల కేంద్రంలో సిపిఎం కార్యాలయంలో పోస్టర్స్ ఆవిష్కరంచారు. ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బోండా సన్నిబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజలు, కార్మికులు, గిరిజనులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా రక్షణాబేరి బస్సుయాత్ర లు ప్రారంభించడం జరిగిందన్నారు. బిజెపి మతోన్మాద విధానాలని తిప్పికొట్టాలన్నారు. గిరిజన హక్కులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయన్నారు.ఈ యాత్ర నవంబర్ 3 న పెదబయలుకు చేరుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ బోండా గంగాధరం పాల్గొన్నారు.