
ప్రజాశక్తి వేటపాలెం
మండలం లో ని బైపాస్ రోడ్ నాలుగు రోడ్ల కూడలి లో బస్ షల్టర్ నిర్మాణానికి శుక్రవారం చీరాల నియోజవర్గం వైసిపిి ఇంచార్జి కరణం వెంకటేష్ బాబు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైపాస్ కూడలి చుట్టు పక్కల జబర్ కాలనీ,తానా కాలనీ, చల్లారెడ్డిపాలెం, కొణిజేటి చేనేతపురి, కటారివారి పాలెం,పొట్టిసుబ్బయ్య పాలెం, ఒంగోలు వెళ్లుటకు వేటపాలెం పురప్రముఖులు చీరాల-ఒంగోలు బైపాస్ రైడ్ బస్సు ఎక్కాలి అన్న బైపాస్ కూడలి వద్దకు చేరాలిసిందే. బస్సు వచ్చేవరకు ఎండ వాన రోడ్డు ప్రక్కన నిలబడి త్రీవ ఇబ్బందులు గురి అవుతున్న ప్రయాణికుల కోసం బస్సు షల్టర్ నిర్మించాలని..వైస్సార్ రైతు నేస్తం గ్రూప్ సభ్యులు తెలియజేసారు. ఈ సందర్భంగా చీరాల వైస్సార్ ఇంచార్జి కరణం వెంకటేష్ బాబు వైస్సార్ రైతు నేస్తం గ్రూప్ సభ్యులుని అభినందించారు. ఈ కార్యక్రంలో వేటపాలెం మండలం ఇంచార్జి ఎం పి డి ఓ ఎం వి ఎస్ శర్మ వెలుగు ఏపీఎం బూదాటి శ్రీనివాసరావు వేటపాలెం వైస్సార్సీపీ మండల ఆద్యషుడు బొడ్డు సుబ్బారావు ఆవుల అశోక్ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు చల్లారెడ్డి పాలెం గ్రామా పెద్దలు పాల్గొన్నారు.