Oct 07,2023 00:19

బస్‌ షెల్టర్‌ ప్రారంభం

బస్‌ షెల్టర్‌ ప్రారంభం
- రూ.2.50 లక్షల ఎంపీ నిధులతో నిర్మాణం
- పారంభించిన మంత్రి ఆర్కే రోజా
ప్రజాశక్తి-నగరి : బస్సురాక కోసం ఎదురుచూస్తూ ఎండపట్టున నిలవాల్సిన అవసరం ఇక లేదు. నిశ్చింతగా హాయిగా బస్‌షెల్టర్‌లో కూర్చొని బస్సు రాగానే ఎక్కి వెళ్లవచ్చు అంటూ రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మండలంలోని బుగ్గ అగ్రహారం గ్రామం ఆదిఆంధ్రవాడ వద్ద నగరి నాగలాపురం రోడ్డును ఆనుకొని రూ.2.50 లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన నూతన బస్‌ షెల్టర్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు కావాల్సిన అవసరాలను, సదుపాయాలను కల్పించడాన్ని బాధ్యతగా బావిస్తూ వారికి అన్నివిధాలుగాను సహకారం అందిస్తున్నానన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన బస్‌షెల్టర్‌ బుగ్గఅగ్రహారం ఆదిఆంధ్రవాడ, అర్జునప్పనాయుడు కండ్రిగలోని వంద కుటుంబాల వారికి ఉపయోగపడటంతో పాటు రోడ్డుపట్టున వెళ్లేవారు వర్షం వచ్చే సమయాల్లో తలదా చుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా ఈ స్థానికంగా ఉన్న మాతమ్మ ఆలయంలో ఆమె పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లీలామాధవి, నగరి ఎంపీపీ భార్గవీ, వైస్‌ఎంపీపీలు కన్నియప్ప, డిల్లి, పీఏసీఎస్‌ చైర్మన్‌ తిరుమలరెడ్డి, ఆర్బీకే చైర్మన్‌ బుజ్జిరెడ్డి, మండల సచివాలయ కన్వీనర్‌ హరి, సర్పంచ్‌లు రవికుమార్‌, చంద్రకళ, ఎంపీటీసీ జ్యోతి, స్థానిక నాయకులు కుమారస్వామి, సత్య, వెంకటరెడ్డి, దాము నాయుడు, అరుణాచలం, నిర్మల, వెంకటేశ్‌, మోహన్‌, వెంకటయ్య పాల్గొన్నారు.