ప్రజాశక్తి నందిగామ : కడపలో న్యాయవాదులపై పోలీసులు దాడిని నిరసిస్తూ నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బండి మల్లికార్జున ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నందిగామ కోర్టు ఆవరణలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బండి మల్లికార్జునరావు మాట్లాడుతూ కడప న్యాయవాదు లు సుబ్రమణ్యం, హొవడల విక్రంపై కడప వన్ టౌన్ పోలీసులు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. న్యాయవాదులపై క్రూరత్వ ముగా హొచెడుగా ప్రవర్తించిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ సెక్రెటరీ పి ప్రకాష్ , బార్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర రావు, సీనియర్ న్యాయ వాదులు చావాలి సాంబశివరావు , న్యాయవాది షేక్ జాఫర్ , హైకోర్టు న్యాయవాది ఎక్కిరాల హనుమంతరావు , న్యాయవాది పాల్ ప్రసాద్, షేక్ ఆజాద్ పాల్గొన్నారు










