ప్రజాశక్తి - కాకినాడ
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్‌ను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉద్యోగ, కార్మిక, మహిళా సంఘాలు సుందరయ్య భవన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఇలాక్కియాకు వినతిపత్రం ఇచ్చారు. సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడకొండ, ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జి, టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబు, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి వరలక్ష్మి, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ మాట్లాడారు. ఈ ధర్నాలో కెవిపిఎస్ నాయకులు కష్ణమూర్తి, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, మలకా రమణ, ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు తాళ్లూరి రాజు, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మోర్త రమణి, జ్యోతి, భూలక్ష్మి, ఐ.దుర్గ, నక్షత్ర, అక్షయ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు టి.రాజా, దినేష్ కుమార్, ఆశా నాయకులు నర్ల ఈశ్వరి, రమణమ్మ, ఐఎఫ్‌టియు నాయకులు మల్లవారపు రాజు, బొద్దు సత్యన్నారాయణమూర్తి, శ్రీపాదం సత్తిబాబు, మదన్ మోహన్, కె.దుర్గా భవాని, వడ్డి పండు, ఎస్.లక్ష్మి, జి.లోవరత్నం, కర్రి రాజారావు, గంగాధర్, ఎం.లిల్లీపుష్ప, సత్యవేణి, కమలావతి, అరుణ, జాన్‌బాబు, వాసంశెట్టి సత్యనారాయణ, కోటా సత్య శ్రీనివాస్, బులిచార లోవరాజు పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న నాయకులు










